![]() |
![]() |
.webp)
తెలంగాణలో పెళ్ళి తర్వాత ఓడు బియ్యం పోస్తారు. అది గృహ ప్రవేశం రోజు కూడా జరుపుకుంటారు కొందరు. ప్రస్తుతం ముహుర్తాలు బాగుండటంతో శివజ్యోతి అలియాస్ జ్యోతక్క కొత్తింటిలో గృహప్రవేశాన్ని గ్రాంఢ్ గా జరుపుకుంది. ఈ వేడుకకి చాలా మంది అతిథులు వచ్చారు. ఎవరెవరు వచ్చారు, వాళ్లని ఎలా రిసీవ్ చేసుకుందో అన్నింటిని తన యూట్యూబ్ ఛానెల్ లోని వ్లాగ్ లో వివరించింది జ్యోతక్క.
శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి.. అందరికి సుపరిచితమే. అందరిని కలుపుకుపోయే శివజ్యోతి మాటతీరుని చూసి ఇష్టపడని వారంటు ఎవరూ ఉండరు. బిగ్ బాస్ ద్వారా కోట్లాది ప్రేక్షకులకు దగ్గర అయింది శివజ్యోతి. బిగ్ బాస్ తో సెలబ్రిటీ లిస్ట్ లో చేరింది. తీన్మార్ సావిత్రిగా ప్రముఖ టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్ గా చేసిన శివజ్యోతి.. తన మాట తీరు తో అందరిని ఆకట్టుకుంది. తెలంగాణ యాసతో పాటు తను మాట్లాడే తీరు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా చేసింది.
దాంతో వల్ల మంచి క్రేజ్ సంపాదించుకుంది శివజ్యోతి.. అంతే కాకుండా బిగ్ బాస్ 3 లో ఎంట్రీ ఇచ్చి హోస్ లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది బిగ్ బాస్ 3 లో మోస్ట్ ఎమోషనల్ గా శివజ్యోతి ని చెప్తారు... బిగ్ బాస్ తర్వాత శివ జ్యోతి కి కెరీర్ కి బ్రేక్ పడింది మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేనంత మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ని గడుపుతుంది. శివజ్యోతి ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి ప్రేక్షకులకు న్యూస్ ని అందిస్తుంది. శివజ్యోతి న్యూస్ చదవడంలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. చమాత్కరంతో వార్తలు చదవడంలో శివజ్యోతి తర్వాతనే మరొకరని అనడంలో ఆశ్చర్యం లేదు.
శివజ్యోతి తన యూట్యూబ్ ఛానెల్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు దగ్గరగా ఉంటూ వస్తుంది. శివజ్యోతి భర్త గంగూలీ కూడా అందరికి సుపరిచితమే. అప్పట్లో శివజ్యోతి, గంగూలీ కలిసి ఇస్మార్ట్ జోడిలో పార్టిసిపేట్ చేసి అందరిని మెప్పించారు. ఇప్పుడు తాజాగా " కొత్త ఇంట్ల ఓడి బియ్యం.. గృహప్రవేశానికి వచ్చిన అతిథులు" అనే వ్లాగ్ ని అప్లోడ్ చేసింది. " ఈ మధ్యే కొత్త ఇల్లు తీసుకున్నాం కదా, అందులో గృహ ప్రవేశం జరుపుకుంటున్నాం.
దానికి చాలా మంది అతిథులు వచ్చారు. నేను నా భర్త అతిథులని రిసీవ్ చేసుకున్నాం. ఓడు బియ్యం అనేది పెళ్ళి తర్వాత మేం జరుపుకుంటాం. బియ్యంలో పసుపు, నూనె వేసి కలిపి పూజ చేస్తాం. ఆ పూజ తర్వాత ఆ ఓడు బియ్యం దంపతులు వచ్చి.. మేం ఒడిలో పట్టుకున్న చీరకొంగులో పోస్తారు. దీనినే ఓడు బియ్యం అంటాం. ఇది మా సైడ్ ఆచారం" అంటూ జ్యోతక్క ఈ వ్లాగ్ లో చెప్పింది. అయితే తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.
![]() |
![]() |